శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:20:53

కొత్త కేసులు.. 1,597

కొత్త కేసులు.. 1,597

  • జీహెచ్‌ఎంసీలో 796 మందికి పాజిటివ్‌
  • 11 మంది మృతి, 1,159 మంది డిశ్చార్జి
  • రెండు లక్షలు దాటిన వైరస్‌ నిర్ధారణ పరీక్షలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో బుధవారం కొత్తగా 1,597 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 796 రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 212, మేడ్చల్‌ మల్కాజిగిరి 115, సంగారెడ్డి 73, నల్లగొండ 58, వరంగల్‌ అర్బన్‌ 44, కరీంనగర్‌ 41, కామారెడ్డి 30, సిద్దిపేట 27, మంచిర్యాల 26, మహబూబ్‌నగర్‌ 21, పెద్దపల్లి 20, మెదక్‌ 18, జయశంకర్‌ భూపాలపల్లి 15, సూర్యాపేట జిల్లాల్లో 14 కేసులు, యాదా ద్రి భువనగిరి, నిజామాబాద్‌ 13 చొప్పున, జనగామ 8, భద్రాద్రి కొత్తగూడెం 7, ఖమ్మం, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 6 చొప్పున, మహబూబాబాద్‌, నారాయణపేట, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో 5 చొప్పున, జోగుళాంబ గద్వా ల, ములుగు జిల్లాల్లో 4 చొప్పున, ఆదిలాబాద్‌ 1 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొ త్తం 2,08,666 పరీక్షలుచేయగా, 39,342 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. బుధవారం ఒక్కరోజే 11 మంది చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 386కు చేరింది.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
బుధవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,597
39,342  
డిశ్చార్జి అయినవారు
1,159
25,999
మరణాలు
11
386
యాక్టివ్‌ కేసులు
-12,958


కరోనా రోగులు, వైద్యసిబ్బంది డైట్‌ చార్జీలు పెంపు

కరోనా బాధితులకు, వారికి సేవలందిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి డైట్‌ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ దవాఖానల్లో బాధితులకు ఉదయం టిఫిన్‌, 11 గంటలకు స్నాక్స్‌, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 4 గంటలకు డ్రైఫ్రూట్స్‌, రాత్రి భోజనం, ప్రతి రోజు 4 లీటర్ల నీళ్లు అందిస్తున్నది. దీని కోసం రోజుకు జీహెచ్‌ఎంసీ పరిధిలో రూ.275, రాష్ట్రంలోని మిగతాచోట్ల రూ.200 చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా బాధితులు ఉంటున్న దవాఖానల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందికి కూడా భోజనం అందించేందుకు జీహెచ్‌ఎంసీలో రూ.300, మిగతాచోట్ల రూ.250 అందించాలని నిర్ణయించింది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం సమర్థవంతంగా పని చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు అందిస్తున్నామని, డాక్టర్లు, సిబ్బంది సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని పేర్కొన్నారు.


logo