బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 03:32:21

రికవరీ రేటు 72.3 %

రికవరీ రేటు 72.3 %

  • గురువారం ఒక్కరోజే 21,380 పరీక్షలు
  • తాజాగా 1,986 మందికి కరోనా పాజిటివ్‌
  • 14 మంది మృతి, 816 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. గురువారం 21,380 పరీక్షలు నిర్వహించగా, మొత్తం టెస్టుల సంఖ్య 4,37,580కి చేరినట్టు శుక్రవారం వైద్యారోగ్యశాఖ విడుదలచేసిన బులెటిన్‌లో పేర్కొన్నది. రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు 72.3 శాతం ఉన్నట్టు తెలిపింది. గురువారం ఒక్కరోజే 1,986 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 586 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌మల్కాజిగిరిలో 207, రంగారెడ్డిలో 205, వరంగల్‌అర్బన్‌లో 123, కరీంనగర్‌లో 116, సంగారెడ్డిలో 108, మహబూబ్‌నగర్‌లో 61, కామారెడ్డిలో 46, మెదక్‌లో 45, ఖమ్మంలో 41, మహబూబాబాద్‌లో 37, నల్లగొండలో 36, మంచిర్యాలలో 35, జోగుళాంబగద్వాలలో 32, నాగర్‌కర్నూల్‌, వరంగల్‌రూరల్‌లో 30 చొప్పున, భద్రాద్రికొత్తగూడెంలో 29, ములుగులో 27, పెద్దపల్లిలో 26, రాజన్నసిరిసిల్లలో 23, జనగామలో 21, సిద్దిపేటలో 20, నిజామాబాద్‌లో 19, వనపర్తిలో 18, ఆదిలాబాద్‌లో 16, యాదాద్రి భువనగిరిలో 12, నిర్మల్‌లో 9, జగిత్యాలో 7, సూర్యాపేటలో 6, వికారాబాద్‌లో 5, జయశంకర్‌ భూపాలపల్లి, నారాయణపేటలో 4 చొప్పున, కుమ్రంభీంఆసిఫాబాద్‌లో 2 కేసులు వెలుగుచూశాయి. కరోనాకు తోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా 14 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 519కి చేరుకున్నది. 816 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు మొత్తం 45,388 మంది రికవరీ అయ్యారు. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు


వివరాలు      
గురువారం
మొత్తం 
పాజిటివ్‌ కేసులు   
 1,986
62,703
డిశ్చార్జి అయినవారు    
 816
45,388
మరణాలు   
14  
 519
చికిత్స పొందుతున్నవారు     
-
16,796

logo