ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 01:51:52

42 వేలు దాటిన డిశ్చార్జిలు

42 వేలు దాటిన డిశ్చార్జిలు

  • రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 13వేలు
  • 3.63 లక్షలకుపైగా కరోనా పరీక్షలు
  • ఆదివారం 1,473 పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా బాధితులు వేగంగా కోలుకుంటున్నారు. ఆదివారం వరకు 55,532 కేసులు నమోదవగా, వీరిలో 42,106 మంది చికిత్స ద్వారా వైరస్‌ను జయించి క్షేమంగా ఇండ్లకు చేరుకున్నారు. ఫలితంగా యాక్టివ్‌ కేసులు సంఖ్య 12,955గా ఉన్నది. ఆదివారం ఒక్కరోజే 9,817 పరీక్షలుచేయగా, మొత్తం టెస్టులు 3,63,242కు చేరుకున్నాయి. ప్రతి 10 లక్షల జనాభాకు 140 మందికి నిర్ధారణ పరీక్షలుచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుండగా, రాష్ట్రంలో మాత్రం 245 పరీక్షలను నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ సోమవారం విడుదలచేసిన సమగ్ర బులెటిన్‌ తెలిపింది. రాష్ట్రంలో ఆదివారం 1,473 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జీహెచ్‌ఎంసీలోనే 506 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 168, వరంగల్‌ అర్బన్‌లో 111, సంగారెడ్డిలో 98, కరీంనగర్‌లో 91, మేడ్చల్‌మల్కాజిగిరిలో 86, నిజామాబాద్‌లో 41, మహబూబాబాద్‌లో 34, జోగుళాంబగద్వాల, సూర్యాపేటలో 32 చొప్పున, ఆదిలాబాద్‌, నల్లగొండలో 28 , ఖమ్మంలో 20, నాగర్‌కర్నూల్‌, రాజన్నసిరిసిల్లలో 19 , జగిత్యాలలో 18, మెదక్‌, కామారెడ్డిలో 17, మంచిర్యాలలో 14, ములుగు, సిద్దిపేటలో 12 , యాదాద్రి భువనగిరిలో 11, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, జయశంకర్‌భూపాలపల్లిలో 10 , వనపర్తిలో 9, మహబూబ్‌నగర్‌, వరంగల్‌రూరల్‌లో 8, నారాయణపేట, వికారాబాద్‌లో 2   కేసులు రికార్డయ్యాయి. కరోనాకుతోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల వల్ల 8 మంది మృతిచెందగా, మొత్తం మరణించినవారి సంఖ్య 471కు చేరుకున్నది. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 21 శాతంగా ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు


ఆదివారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,473
55,532
డిశ్చార్జి అయినవారు    
 774
42,106
మరణాలు 1
  8   
47
చికిత్స పొందుతున్నవారు   
  -
12,955


     


logo