శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 10:04:29

తెలంగాణలో కొత్తగా 331 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 331 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్తగా 331 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. తాజాగా కేసులతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,90,640కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. మంగళవారం కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,571కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 394 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,84,611కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,458 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 2,461 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపింది. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు0.54శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.92శాతానికి చేరిందని పేర్కొంది. మంగళవారం 38,192 నమూనాలను పరిశీలించగా.. ఇప్పటి వరకు 73,50,644 శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.