సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 01:46:19

రాష్ట్రంలో కొత్తగా 1524 కేసులు

రాష్ట్రంలో కొత్తగా 1524 కేసులు

  • తాజాగా 1,524 మందికి పాజిటివ్‌
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో 815
  • 37 వేలు దాటిన కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా విజృంభణ తగ్గడంలేదు. తాజాగా మం గళవారం 1,524 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 815 కేసులు వెలుగుచూశాయి. రంగారెడ్డి జిల్లాలో 240, మేడ్చల్‌ మల్కాజిగిరి 97, సంగారెడ్డి 61, నల్లగొండ 38, వరంగల్‌ అర్బన్‌ 30, కరీంనగర్‌ 29, మెదక్‌ 24, వికారాబాద్‌ 21, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి 19, నిజామాబాద్‌ 17, సూర్యాపేట 15, జోగుళాంబగద్వాల 13, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి 12, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం 8, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ 7, ములుగు 6, వనపర్తి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ 5, సిద్దిపేట, జనగామ 4, నిర్మల్‌ 3, వరంగల్‌ రూరల్‌, జగిత్యాల 2, నాగర్‌కర్నూల్‌ 1 చొప్పున కేసులు నమోదయ్యా యి. కరోనాకు ఇతర ఆరోగ్య సమస్యలు తోడవడంతో ఒక్కరోజే 10 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 375కు చేరింది. రాష్ట్రంలో 1,95,024 పరీక్షలుచేయగా, 37,745 పాజిటివ్‌గా తేలాయి. కొవిడ్‌ చికిత్స అందించే ప్రభుత్వ దవాఖానల్లో మొత్తం 17,081 పడకలు ఉండగా, 1,805 మాత్రమే భర్తీ అయ్యాయని, 15,276 పడకలు ఖాళీగా ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

పెండ్లి కొడుకుకు కరోనా.. ఆగిన లగ్గం 

పెబ్బేరు రూరల్‌: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురానికి చెందిన యువకుడికి బుధవారం పెండ్లి జరగాల్సి ఉన్నది. నాలుగు రోజులుగా అస్వస్థతకు గురవడంతో పరీక్ష చేయించుకోగా సోమవారం పాజిటివ్‌ తేలింది. దీంతో పెండ్లి వాయిదాపడింది. బాధితుడికి హోంఐసొలేషన్‌లో వైద్యం అందిస్తున్నారు.  

మృతదేహం తరలింపు జాప్యం

బన్సీలాల్‌పేట్‌: కరోనాతో మరణించిన వ్యక్తి మృతదేహం తరలింపులో తీవ్రజాప్యంపై దు మారం చెలరేగడంతో గాంధీ దవాఖాన సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు వివరణ ఇ చ్చారు. మంగళవారం గాంధీ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ నాలుగో తరగతి సిబ్బంది సమ్మెకు దిగడం, కొద్దిమందే రోగులకు సేవలందించడంతో జాప్యం జరిగిందని చెప్పారు. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
మంగళవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,524
37,745 
డిశ్చార్జి అయినవారు
1,161
24,840
మరణాలు
10375
చికిత్స పొందుతున్నవారు
-12,531 


logo