గురువారం 02 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 01:42:00

పదివేలు దాటిన కేసులు

పదివేలు దాటిన కేసులు

  • ఒక్కరోజే 891 మందికి కరోనా నిర్ధారణ
  • జీహెచ్‌ఎంసీలో 719 మందికి పాజిటివ్‌
  • ఐదుగురి మృతి, 137 మంది డిశ్చార్జి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్నది. వారంరోజులుగా రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 891 కేసులు వెలుగుచూడటంతో ఈ సంఖ్య 10 వేలు దాటింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 719 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

రంగారెడ్డి జిల్లాలో 86 కేసులు, మే డ్చల్‌ మల్కాజిగిరి 55, భద్రాద్రికొత్తగూడెం 6, ఖమ్మం 4, వరంగల్‌రూరల్‌, అర్బన్‌జిల్లాల్లో 3 చొప్పున, సంగారెడ్డి, కరీంనగర్‌, నల్లగొండలో 2 చొప్పున, కామారెడ్డి, సిద్దిపేట, సిరిసిల్ల, జోగుళాంబగద్వాల, పెద్దపల్లి, సూర్యాపేట, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. చికిత్స పొందుతున్నవారిలో వైరస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాల వల్ల ఐదుగురు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 225కు చేరింది. బుధవారం 4,069 నమూనాలను పరీక్షించగా, 3,178 మందికి నెగెటివ్‌గా తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 67,318కి చేరింది.

రాష్ట్రంలో నమోదైన కరోనా కేసులు

వివరాలు
 బుధవారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
89110,444 
డిశ్చార్జి అయినవారు
137
4,361 
మరణాలు
5225
చికిత్స పొందుతున్నవారు
-5,858 


logo