శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 06, 2020 , 02:12:54

కొత్తగా 1,590 పాజిటివ్‌

కొత్తగా 1,590 పాజిటివ్‌

  • జీహెచ్‌ఎంసీలో 1,277 మందికి కరోనా 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆదివారం కొత్తగా 1,590 కరోనా కేసులు రికార్డయ్యాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే 1,277 నిర్ధారణ అయినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 125, రంగారెడ్డి 82, సూర్యాపేట 23, సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ 19, నల్లగొండ 14, కరీంనగర్‌, వనపర్తి 4, మెదక్‌, నిజామాబాద్‌ 3, నిర్మల్‌, వికారాబాద్‌, భద్రాద్రికొత్తగూడెం, జనగామ 2 చొప్పున, జోగుళాంబగద్వాల, రాజన్నసిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్‌రూరల్‌, నారాయణపేట, పెద్దపల్లి, యాదాద్రిభువనగిరి, కామారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 1 కేసు నమోదయ్యా యి. కరోనాతోపా టు వివిధ వ్యాధులతో బాధపడుతు న్న ఏడుగురు మరణించారు.

చికిత్స అనంతరం 1,166 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 84 శాతం 13-60 ఏండ్ల మధ్య వారే ఉన్నారు. 12 ఏండ్ల లోపువారు 1,184 మంది, 60 ఏండ్లు పైబడిన వారు 2,627 మంది ఉన్నట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. మొత్తం కేసుల్లో పురుషుల శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు      
ఆదివారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,590
23,902  
డిశ్చార్జి అయినవారు     
1,166
12,703
మరణాలు
7295
చికిత్స పొందుతున్నవారు
-10,904


logo