సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 19, 2020 , 01:37:51

70% డిశ్చార్జి

70% డిశ్చార్జి

  • ఒక్కరోజే 1,902 మంది ఇంటికి 
  • రాష్ట్రంలో తాజా కేసులు 1,284 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా బాధితులు వేగంగా కోలుకొంటున్నారు. శనివారం ఒక్కరోజే 1,902 మంది బాధితులు కోలుకొని ఇంటికిచేరారు. దీంతో డిశ్చార్జిల రేటు 70 శాతంగా నమోదైందని వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. మొత్తం కేసులు 43,780 కాగా, ఇందులో 30,607 మంది చికిత్స అనంతరం క్షేమంగా ఇండ్లకుచేరుకున్నారు. మరోవైపు శనివారం రికార్డుస్థాయిలో 14,883 నమూనాలను పరీక్షించారు. ఇందులో 1,284 పాజిటివ్‌గా తేలాయి. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 667 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. సంగారెడ్డి జిల్లాలో 86, రంగారెడ్డిలో 68, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 62, కరీంనగర్‌లో 58, నల్లగొండలో 46, వరంగల్‌ అర్బన్‌లో 37, వికారాబాద్‌లో 35, నిజామాబాద్‌లో 26, వనపర్తిలో 24, సూర్యాపేటలో 23, సిద్దిపేటలో 22, మంచిర్యాలలో 19, మహబూబ్‌నగర్‌లో 16, మెదక్‌లో 15, పెద్దపల్లి, జోగుళాంబ గద్వాలలో 14 చొప్పున, ఖమ్మం, యాదాద్రి భువనగిరిలో 10 చొప్పున, ఆదిలాబాద్‌లో 8, జనగామలో 6, వరంగల్‌ రూరల్‌లో 5, జయశంకర్‌ భూపాలపల్లిలో 4, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 2 చొప్పున, నిర్మల్‌, నాగర్‌కర్నూల్‌, జగిత్యాలలో 1 కేసు చొప్పున నమోదయ్యాయి. వైరస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాల వల్ల ఆరుగురు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 409కు పెరిగింది. ఇది 0.93 శాతం మాత్రమేనని అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్నవారు 29 శాతం మాత్రమే ఉన్నారని వివరించారు.  

ఆగస్టు 14 వరకు న్యాయవ్యవస్థ లాక్‌డౌన్‌ 

హైకోర్టులో సాధారణ న్యాయప్రక్రియను ఆగస్టు 14 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీచేసేవరకు సస్పెండ్‌ చేయాలని హైకోర్టు జడ్జిల సమావేశం శనివారం నిర్ణయించింది. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు     
 శనివారం
మొత్తం 
పాజిటివ్‌ కేసులు
1,284
43,780  
డిశ్చార్జి అయినవారు
1,902
30,607
మరణాలు
 6
409
చికిత్స పొందుతున్నవారు    
 -
12,765
logo