ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 09:49:12

మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా

మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా

పెద్దపల్లి : జిల్లాలోని రామగుండంలో డీజీపీ మహేందర్‌ రెడ్డి ఇవాళ ఉదయం పర్యటించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టామని డీజీపీ పేర్కొన్నారు. ఇప్పటికే సరిహద్దుల్లో ప్రత్యే నిఘా ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడుతున్న వారికి శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్నేహపూర్వక పోలీసింగ్‌లో భాగంగా ప్రజలతో మమేకం అవుతున్నట్లు చెప్పారు. రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ పేర్కొన్నారు. 


logo