శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 22, 2020 , 15:09:35

దండం పెడుతున్నాం.. బ‌య‌ట‌కు రాకండి

దండం పెడుతున్నాం.. బ‌య‌ట‌కు రాకండి

హైద‌రాబాద్‌: జ‌న‌తా క‌ర్ఫ్యూ నేప‌థ్యంలో పోలీసులు విస్తృతంగా ప‌హారా కాస్తున్నారు.  నియ‌మావ‌ళిని అతిక్రమించి రోడ్ల‌పై తిరిగే వారికి సూచ‌న‌లు చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో న‌గ‌ర పోలీసులు చేతులు జోడించి.. ఇండ్ల‌ల్లోనే ఉండాల‌ని ప్ర‌జ‌ల‌ను కోరుతున్నారు. క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి స‌హ‌క‌రించాల‌ని వేడుకుంటున్నారు. కొన్ని చోట్ల పోలీసులు ప్ల‌కార్డులు ప‌ట్టుకుని త‌మ సంఘీభావాన్ని తెలిపారు. మీకోసం మేం ప‌నిచేస్తున్నాం, మీరు ఇండ్ల‌ల్లోనే ఉండండి అన్న ప్ల‌కార్డుల‌ను పోలీసులు ప్ర‌ద‌ర్శించారు. 

మ‌రోవైపు క‌రోనా వైర‌స్ వ‌ల్ల భార‌త్‌లో మృతిచెందిన వారి సంఖ్య ఆరుకు చేరుకున్న‌ది.  జ‌న‌తా క‌ర్ఫ్యూను త‌మిళ‌నాడు రాష్ట్రం రేపు ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు పొడిగించింది.  దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అయిన 75 జిల్లాల‌ను లాక్‌డౌన్ చేస్తున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.
logo