గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 01:54:46

దేశంలోనే తెలంగాణ పోలీస్‌ నంబర్‌ వన్‌

దేశంలోనే తెలంగాణ పోలీస్‌ నంబర్‌ వన్‌
  • పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌

ఫెర్టిలైజర్‌సిటీ/సీసీసీ నస్పూర్‌: దేశంలోనే తెలంగాణ పోలీసులు అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా గుర్తింపు సాధిస్తున్నారని పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కోలేటి దామోదర్‌ అన్నా రు. గురువారం మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌ కాలనీలో పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించి, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నూతనంగా నిర్మిస్తున్న వన్‌ టౌన్‌ మోడల్‌ ఠాణా, పోలీస్‌ విశ్రాంతి భవనం, కమిషనరేట్‌ నూత న కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే పోలీసులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడంతోపాటు వారికి కావాల్సిన సదుపాయాల కల్పనకు ప్రత్యేకంగా నిధులు కేటాయించిందన్నారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట, గచ్చిబౌలి, ఆదిభట్ల పోలీస్‌స్టేషన్లను సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించిందని, పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ను ఇతర రా ష్ర్టాల సీఎంలు, ఉన్నతాధికారులు కొనియాడారన్నారు. జూబ్లీహిల్స్‌లో రోడ్డు నంబర్‌ 12 లోని టెక్‌ టవర్‌ రూ.400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామనీ, 20 అంతస్తుల ఈ భవనం త్వరలోనే పూర్తవుతుందన్నారు. 


logo
>>>>>>