శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 23, 2020 , 01:41:16

కొవిడ్‌ 19 పోలీసింగ్‌ మాన్యువల్‌!

కొవిడ్‌ 19 పోలీసింగ్‌ మాన్యువల్‌!

  • దేశంలోనే తొలిసారిగా రూపొందించిన రాష్ట్ర పోలీసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా మహమ్మారి కట్టడి వ్యూహాలతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు కొవిడ్‌ 19 పోలీసింగ్‌ రెఫరెన్స్‌ మాన్యువల్‌ను రూ పొందించారు. కరోనా సంక్షోభం  నేపథ్యం లో విధులపై సిబ్బందికి మరింత స్పష్టత ఉండేలా డీజీపీ మహేందర్‌రెడ్డి సూచనలతో వెస్ట్‌జోన్‌ ఐజీ స్టీఫెన్‌ రవీంద్ర ప్రత్యేక మాన్యువల్‌ను తయారుచేశారు. కొవిడ్‌ పోలీసింగ్‌పై ఎక్కడా రాతపూర్వక నివేదికలు అందుబాటులో లేక పోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఆదేశాలు, డీజీపీ సర్క్యులర్లను కలుపుకొని కొవిడ్‌ 19 పోలీసింగ్‌ రెఫరెన్స్‌ మాన్యువల్‌ను రూపొందించారు. ఇందులో మొత్తం 19 ప్రధానాంశాలున్నాయి. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పరిస్థితుల అంచనా, పరిస్థితిని అదుపులోకి తేవడం, లాక్‌డౌన్‌ అమలు, కరోనా రోగులు, వారి కాంటాక్ట్‌ వ్యక్తులను గుర్తించ డం, క్వారంటైన్‌ చేయడం, పాజిటివ్‌ రోగుల కు చికిత్స అందించే దవాఖానలు, క్వారంటైన్‌ కేంద్రాల వద్ద భద్రత, డాక్టర్లు, వైద్యసిబ్బంది పరిరక్షణసహా అనేక అంశాలు పొందుపర్చా రు. లాక్‌డౌన్‌ అమలులో కొవిడ్‌ కంట్రోల్‌ రూం, ప్రజల సాధారణ జీవనానికి అత్యవసరమైన ఆహార పదార్థాలు, మందుల సరఫరా, వైద్యసాయానికి తీసుకోవాల్సిన చర్యలను ఒక చాప్టర్‌గా పేర్కొన్నారు. వలస కార్మికుల సంక్షేమం, వారిని స్వస్థలాలకు పంపే చర్యలు, విదేశాల నుంచి రాష్ర్టానికి వచ్చే వారిపట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా 45 పేజీల మాన్యువల్‌ను రూపొందించారు.


logo