e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్‌శాఖ : హోంమంత్రి

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్‌శాఖ : హోంమంత్రి

దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్‌శాఖ : హోంమంత్రి

హైదరాబాద్‌ : దేశానికే తెలంగాణ పోలీస్‌ శాఖ ఆదర్శంగా ఉందని తెలంగాణ హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. శాంతిభద్రతలు అదుపులో ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. పోలీస్‌ శాఖకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలీస్‌ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. ఆసిఫ్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన పోలీసు స్టేషన్‌ను పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతలను చక్కదిద్ది, తెలంగాణ పోలీసులు శాంతి భద్రతల పర్యవేక్షణలో దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా ముఖ్యమంత్రి చేశారని కొనియాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తూ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారని, ఈవ్‌టీజింగ్‌లు లేకుండా చేయడంలో షీ టీమ్స్‌ విజయం సాధించి, ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. పోలీస్‌ శాఖలో మహిళలకు 33 శాతం రిజిర్వేషన్లు ఇస్తున్నామన్నారు. వ్యవస్తీకృత నేరాలను పూర్తిగా అణిచివేశామని, పీడీ యాక్టులతో నేరాలు పూర్తిగా తగ్గాయన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దేశానికే ఆదర్శంగా తెలంగాణ పోలీస్‌శాఖ : హోంమంత్రి

ట్రెండింగ్‌

Advertisement