హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): సహకార వ్యవస్థ బలంగా ఉంటేనే గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలంగా ఉంటుందని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు (టెస్కాబ్)కు జాతీయస్థాయిలో ఉత్తమ అవార్డు దక్కడంపై కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మంగళవారం తనను కలిసిన టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావును మంత్రి కేటీఆర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరింత ముందుకెళ్లాలని సూచించారు. మరోవైపు, రవీందర్‌రావుకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ అభినందనలు తెలిపారు. జిల్లాలవారీగా ఉన్నటువంటి సహకార బ్యాంకులన్నీ కలిపి ఏకైక సహకార బ్యాంకుగా ఉంటే బాగుంటుందని వినోద్‌కుమార్ అభిప్రాయపడ్డారు.