శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Nov 24, 2020 , 12:08:02

ఆరేండ్లలో అభివృద్ధి పథంలో తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

ఆరేండ్లలో అభివృద్ధి పథంలో తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ :  ఆరేండ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రగతి పథంలో నిలిపిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టేందుకు బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  మత తత్వాన్ని, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే బీజేపీ ఆటలు తెలంగాణలో సాగవని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను బీజేపీ కేంద్ర మంత్రులంతా  ప్రశంసించి.. ఎన్నికల వేళ ఛార్జీషీట్‌ అంటూ బీజేపీ కేంద్ర మంత్రి జవడేకర్‌ అన‌డం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.  

ఎందుకు మాపై ఛార్జీషీటు..

తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ ఎందుకు ఛార్జీషీటు వేసిందో ఆ పార్టీ నాయకులకే తెలియదని అన్నారు.  సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం నెంబర్‌ వన్‌గా గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి కోటిన్నర ఎకరాలకు నీరందించాం.  ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం.  దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తున్నాం. రైతు భీమా పథకంతో రైతుల్లో భరోసా నింపాం. వృద్ధులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇస్తున్నాం.  యేటా రూ. 50 వేల కోట్లు సంక్షేమానికి ఖర్చు చేస్తున్నాం. కేసీఆర్‌ కిట్టుతో మతా శిశు మరణాలు తగ్గించాం. పవన్‌ హాలిడేస్‌ను ఎత్తివేశాం. పరిశ్రమలకు బాగు చేశాం. రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాం. లక్షలాది మంది యువతకు ఉపాధి, విద్యా అవకాశాలు కల్పిస్తున్నాం. ఇందుకు ఛార్జీషీటు వేస్తారా అని బీజేపీని మంత్రి కేటీఆర్‌ నిలదీశారు.

హైదరాబాద్‌కు ఏం చేశారు.. 

హైదరాబాద్‌కు కేంద్రం ఏ చేసిందో సూటిగా సుత్తి లేకుండా చెప్పాలని డిమాండ్‌ చేశారు. తాము ఏం చేశామో చెప్పే ఓటర్లను ఓటు అడుగుతున్నామని బీజేపీకి ఆ దమ్ముందా అన్ని ప్రశ్నించారు. బీజేపీకి అధికారమిస్తే హైదరాబాద్‌ను గుండు గుత్తాగా అమ్మేస్తుందని అన్నారు.  కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేసి ప్రైవేట్‌పరం చేస్తుందని మండిపడ్డారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo