సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 02:09:40

పత్తి సాగులో తెలంగాణ నంబర్‌ 2

 పత్తి సాగులో తెలంగాణ నంబర్‌ 2

  • గుజరాత్‌ను వెనక్కి నెట్టి ముందంజ
  • మొదటి స్థానంలో మహారాష్ట్ర 
  • ఫలితాన్నిచ్చిన నియంత్రిత సాగు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విస్తారమైన వర్షాలు.. నియంత్రిత సాగు విధానంతో పత్తిసాగులో తెలంగాణ సత్తా చాటింది. గుజరాత్‌ను వెనక్కినెట్టి దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉన్నది. తెలంగాణలో ఈ సీజన్‌లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 59.92 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. గతేడాది 45.94 లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తిపంట వేశారు. గతేడాది 65.89 లక్షల ఎకరాలతో రెండోస్థానంలో ఉన్న గుజరాత్‌లో ఈ ఏడాది 56.30 లక్షల సాగయి మూడోస్థానానికి దిగజారింది. పత్తిసాగు విస్తీర్ణం పెరుగుదలలో తెలంగాణ మొదటిస్థానంలో ఉన్నది. గతేడాదితో పోల్చితే తెలంగాణలో ఈ ఏడాది 13.98 లక్షల ఎకరాల్లో అదనంగా సాగయింది. అదేసమయంలో మహారాష్ట్ర, గుజరాత్‌లో సాగువిస్తీర్ణం తగ్గడం గమనార్హం. మహారాష్ట్రలో 3.92 లక్షల ఎకరాల్లో పత్తి సాగు తగ్గింది. దేశవ్యాప్తంగా గతేడాది 313.98 లక్షల ఎకరాల్లో పత్తిసాగైతే ఈసారి 320.16 లక్షల ఎకరాల్లో సాగైంది. 6.18 లక్షల ఎకరాల్లో సాగు పెరిగింది.

60.16 లక్షల ఎకరాల్లో పత్తి

రాష్ట్రంలో పత్తి సాగు పెరుగుదలలో నియంత్రిత సాగు ప్రధానపాత్ర పోషించింది. మార్కెట్లో డిమాండ్‌ గల పంటలనే పండించేలా సీఎం కేసీఆర్‌ రైతులను ప్రోత్సహించారు. ఇందులోభాగంగానే అధిక డిమాండ్‌ కలిగిన పత్తిని 60.16 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని సూచించారు. సీఎం చెప్పిన ప్రకారమే రైతులు పత్తిసాగుకు మొగ్గు చూపారు. లక్ష్యానికి మించి సాగుచేశారు. నియంత్రిత సాగుకు తోడు ఈ సీజన్‌లో విస్తారమైన వర్షాలు పత్తి సాగుకు కలిసివచ్చాయి. రైతులు ముందు నుంచే జోరుగా పత్తిని సాగుచేశారు. 


logo