శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:54:35

ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ నంబర్‌1

ఆన్‌లైన్‌ ఆడిట్‌లో తెలంగాణ నంబర్‌1

  • కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ కితాబు

హైదరాబాద్‌ జనవరి 12 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ఆన్‌లైన్‌ ఆడిట్‌ విధానాన్ని సమర్థంగా అమలుచేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ కితాబిచ్చింది. అన్నిరాష్ర్టాల్లో ఆన్‌లైన్‌ ఆడిట్‌ అప్లికేషన్‌ను అమలుచేసేందుకు ఉన్నవాటిని మరింత మెరుగుపర్చేందుకు కేంద్రం సన్నాహాలు చేపట్టింది. ఇందులోభాగంగా మంగళవారం ఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఆహ్వానం మేరకు జాయింట్‌ సెక్రటరీ కేఎస్‌ సేథితో తెలంగాణ పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌(సీడీఎంఏ) మార్తినేని వెంకటేశ్వరరావు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. 2019-20లో 40 శాతం ఆన్‌లైన్‌ ఆడిట్‌ నిర్వహించి తెలంగాణ దేశంలోనే  నంబర్‌1గా నిలిచిందని కేఎస్‌ సేథి అభినందించారు. గ్రామ పంచాయతీలకు యూజర్‌ఐడీలు క్రియేట్‌ చేయడం, ఆడిట్‌ నివేదికలు ఆన్‌లైన్‌లో పంపడంలో ఎదురయ్యే సమస్యలు, ఆడిట్‌ నివేదికలో మార్పులపై సమావేశంలో చర్చించారు. అనంతరం జాయింట్‌ సెక్రటరీ కేఎస్‌ సేథిని మార్తినేని వెంకటేశ్వరరావు శాలువ కప్పి సత్కరించారు. సమావేశం లో కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ డిప్యూటీ సెక్రటరీ విజయ్‌ కుమార్‌, తెలంగాణ అధికారులు పాల్గొన్నరు.


logo