మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 21, 2020 , 02:52:07

వైద్యుల నిర్లక్ష్యంతోనే యాదయ్య మృతి .. అబద్ధం

వైద్యుల నిర్లక్ష్యంతోనే యాదయ్య మృతి .. అబద్ధం

నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో కొవిడ్‌ వార్డ్‌లో ఆక్సిజన్‌ అందక వేములపల్లి మండలం సల్కునూర్‌కు చెందిన వ్యక్తి చనిపోయారు. ఈ నెల 18న ఉదయం దవాఖానలో చేరగా, నమూనాలను సేకరించి టెస్టుకు పంపించారు. అతను చేరినప్పటి నుంచి వైద్యులు పట్టించుకోలేదు. అదేరోజు సాయంత్రం బాధితుడు ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న పోస్ట్‌ ఇది.

వాస్తవానికి యాదయ్య తీవ్ర శ్వాసకోశ సమస్య, దగ్గు, జ్వరంతో దవాఖానకు ఈ నెల 17న వచ్చారు. కరోనా లక్షణాలు ఉండటంతో ఐసొలేషన్‌ వార్డులో చేర్చి చికిత్స ప్రారంభించారు. 18న నమూనాలను సేకరించి టెస్టుకు పంపించారు. అదేరోజు బాధితుడు మృతిచెందారు. సోమవారం వచ్చిన రిపోర్టులో యాదయ్యకు కరోనా నెగెటివ్‌ అని వచ్చింది. అతను కరోనాతో చనిపోలేదు. దీర్ఘకాలిక శ్వాసకోశ (సీవోపీడీ), ఆల్కహాలిక్‌ లివర్‌ వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఏమీలేదు అని నల్లగొండ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ సోమవారం ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.

- నల్లగొండ


logo