గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Oct 23, 2020 , 13:33:38

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కరోనా

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి కరోనా

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. దేశాధ్యక్షుల నుంచి ముఖ్యమంత్రులు, మంత్రులతోపాటు సాధారణ పౌరులు వైరస్‌ బారినపడి విలవిలలాడుతున్నారు. తాజాగా భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కొవిడ్‌ బారినపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున ప్రచారంలో పాల్గొంటున్న ఆయన గురువారం కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. గత వారంరోజులుగా తనను కలిసి కాంగ్రెస్ నేతలు, ఇతరులు కొవిడ్ టెస్టు చేయించుకొని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. దుబ్బాక ఉప ఎన్నికలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తరఫున ఎంపీ వెంకట్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు కరోనా సోకింది. తాజాగా జ‌హీరాబాద్ టీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్‌‌కు సైతం కరోనా సోకిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.