గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 21:58:32

తెలంగాణలో కొత్తగా 1550 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1550 కరోనా కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో సోమవారం 1,550 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 926 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 36,221 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, వైరస్‌ ప్రభావంతో ఇవాళ 9మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 365కు చేరింది. ఇవాళ 1197మంది వైరస్‌ నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 23,679 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 12,178మంది మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం11,525 మందికి కొవిడ్‌-19 పరీక్షలు చేయగా, ఇప్పటి వరకు 1,81,849 మందికి టెస్టులు చేసినట్లు పేర్కొంది. logo