బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 30, 2020 , 13:11:16

మైనార్టీ గురుకులాల ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ వాయిదా

మైనార్టీ గురుకులాల ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ వాయిదా

హైదరాబాద్‌: రాష్ట్రంలోని మైనార్టీ గురుకులాల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరం, ఐదు నుంచి ఎనిమిదో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన ప్రవేశపరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 12, 18, 20 తేదీల్లో జరగాల్సి ఉన్నాయి. అయితే కరోనా వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్‌డౌన్‌ ప్రకటించింది. దీంతో మైనార్టీ గురుకులాల ప్రవేశపరీక్షలను వాయిదా వేస్తున్నామని, పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలంగాణ మైనారిటీస్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (టెమ్రిస్‌) కార్యదర్శి బీ షఫియుల్లా సోమవారం ప్రకటించారు. 


logo