శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 20:58:23

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలకు పలువురు రాష్ట్ర మంత్రులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

చెడుపై విజయానికి ప్రతీకగా దీపావళి జరుపుకుంటారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి మొఖంలో చిరునవ్వును చూడాలని అనుక్షణం తప్పిస్తూ పనిచేస్తున్న సీఎం కేసిఆర్ ఆశయం నెరవేరాలా ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ పండుగను జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.