శనివారం 28 నవంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 11:29:05

స‌ద్దుల బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రులు

స‌ద్దుల బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపిన మంత్రులు

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రజలకు రాష్ట్ర మంత్రులు సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. స‌ద్దుల బ‌తుక‌మ్మ శుభాకాంక్ష‌లు తెలిపిన వారిలో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హ‌రీష్ రావు, ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌, సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్, రాష్ర్ట ప్ర‌ణాళికా సంఘం ఉపాధ్య‌క్షులు వినోద్ కుమార్‌తో పాటు ప‌లువురు ఉన్నారు. 

ఆడ బిడ్డలను ఇంటికి పిలిచి కానుకలు ఇవ్వడం ఈ పండుగ ఆచార సంప్రదాయమ‌ని మంత్రులు పేర్కొన్నారు. బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకునే పండుగలు సద్దుల బతుకమ్మ, దసరా పండుగలు అని తెలిపారు. అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా పండుగ జ‌రుపుకోవాల‌ని ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి దృష్ట్యా మాస్కులు ధరిస్తూ,భౌతిక దూరం పాటిస్తూ ఈ పండుగలని జరుపుకోవాలి అని సూచించారు.