బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 21:01:22

పసుపు మార్కెటింగ్‌లో కేంద్రం విఫలం...

పసుపు మార్కెటింగ్‌లో కేంద్రం విఫలం...

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పసుపు నాణ్యత పెంపు, మార్కెటింగ్, వినియోగం, దీర్ఘకాలిక ప్రణాళిక, మద్దతు ధరలపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, దేవాదాయ, అటవీ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన రెడ్డి మాట్లాడుతూ... పసుపు మార్కెటింగ్‌లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పసుపు లేని వంట ఉండదు. కానీ రైతులకు మద్దతు ధర లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  అనాదిగా ఔషధ లక్షణాలున్న పసుపును ప్రపంచవ్యాప్తం చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని విమర్శించారు. 


అలెప్పీ పసుపుకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. అదే రకాన్ని ఇక్కడి రైతులకు అందించి సాగులో మెళకువలు అందించడం జరిగింది. నాణ్యతను పెంచడంతో పాటు, ఎగుమతుల మీద దృష్టి సారించాలి. అన్ పాలిష్డ్ పసుపుతో రైతులు నష్టపోతున్నారు. పండించిన పంటను ఉడికించి, ఎండబెట్టి మార్కెట్ కు తెస్తున్నారు. 900 ఏళ్లుగా పసుపు సాగును సాంప్రదాయంగా సాగు చేస్తున్నారు. ప్రభుత్వమే పసుపును తీసుకుని ప్రాసెసింగ్ చేసే అవకాశాల మీద దృష్టి సారించాలి. పసుపులో కర్క్ మెన్ శాతం పెంచితే ఎగుమతులు పెరిగి మద్దతుధర లభిస్తుంది. ప్రపంచంలో పసుపు వాడకం తక్కువ .. కలర్స్, ఫార్మా రంగాలలో దీని వినియోగం పెంచితే బాగుంటుంది.


 పసుపులో సిండికేట్ దోపిడి ఉంది. 1.33 లక్షల ఎకరాలలో రూ.1687 కోట్ల విలువైన 2.81 లక్షల మెట్రిక్ టన్నుల పసుపు ఉత్పత్తి అవుతుంది. పసుపులో కల్తీని పూర్థిస్థాయిలో అరికట్టాలి. పీపీపీ మోడల్ లో పసుపు ప్రాసెసింగ్, మార్కెటింగ్ అంశాలపై దృష్టి సారించాలి. పతంజలి లాంటి సంస్థలకు వసతులు కల్పిస్తే మన పసుపును పూర్తిగా వారే కొంటారేమో ప్రయత్నాలు చేయాలి.  పసుపు వినియోగం పెంచే అవకాశాలు, నాణ్యమైన పసుపు వంగడాలు రైతులకు అందించి దిగుబడి పెంచే ప్రయత్నించాలి. దీర్ఘకాలిక ప్రణాళికతో ఏం చేయగలం ? స్వల్పకాలికంగా రైతులకు ఏం చేయగలం ? అనే అంశంపై కమిటీ నియమించి నివేదిక వచ్చిన తరువాత చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్దాం.  పసుపు వినియోగం, నిల్వలు, ఉత్పత్తి ని పరిశీలిస్తే పసుపు సాగుకు ప్రమాద ఘంటికలు చూయిస్తున్నాయి. నిపుణుల కమిటీ వేసి పసుపు వినియోగం అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.


 సమీక్షలో  వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్దన్, సంజయ్ కుమార్, జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్, జీవన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉద్యాన శాఖ సంచాలకులు వెంకట్రాంరెడ్డి, మార్క్ ఫెడ్ ఎండీ భాస్కరాచారి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఆయుష్, ఉద్యాన విశ్వవిద్యాలయం అధికారులు


logo
>>>>>>