బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Nov 07, 2020 , 21:21:34

కేటీఆర్‌కు మంత్రుల అభినందన

కేటీఆర్‌కు మంత్రుల అభినందన

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అమెజాన్ వెబ్‌ సర్వీసెస్‌ ముందుకురావడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తంచేశారు. రూ.20,761 కోట్ల భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో వారు కలిసి అభినందించారు. కేటీఆర్‌లాంటి యువ నాయకుడు ఐటీశాఖకు మంత్రిగా ఉండటం రాష్ట్రంలో ఐటీరంగానికి భారీగా కలిసి వచ్చిందని అన్నారు. హైదరాబాద్‌కు అంతర్జాతీయ ఐటీ సంస్థలను తీసుకురావడంతో కేటీఆర్‌ పాత్ర ఎనలేదని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ను కలిసిన వారిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి  తదితరులున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.