శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 27, 2020 , 11:48:02

నాయిని భార్య అహ‌ల్య మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

నాయిని భార్య అహ‌ల్య మృతిప‌ట్ల మంత్రుల సంతాపం

హైద‌రాబాద్ : మాజీ హోంమంత్రి దివంగత నాయిని నరసింహారెడ్డి సతీమణి అహల్య మృతిప‌ట్ల తెలంగాణ మంత్రులు సంతాపం తెలిపారు. అహ‌ల్య భౌతిక‌కాయానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు.  

నర్సన్న మరణం నుంచి తేరుకోక ముందే వారి సతీమణి అహల్య గారు మరణించడం బాధాకరం అని మంత్రులు అన్నారు. అహల్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్న‌ట్లు తెలిపారు. వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. 

సంతాపం తెలిపిన వారిలో కేటీఆర్, సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్‌, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, హ‌రీష్ రావు, స‌త్య‌వ‌తి రాథోడ్‌, ప‌లువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.