హైదరాబాద్ : కేటీఆర్ పుట్టిన రోజున ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఈ నెల 24న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆరపుట్టిన రోజును పురస్కరించుకొని.. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం చేపడుతామని తెలిపారు. ఇందులో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ముక్కోటి వృక్షార్చన పోస్టర్ను ఎమ్మెల్యే రవిశంకర్కు అందజేశారు.
ఇవి కూడా చదవండి..
ఆరుగురు గ్రామ కార్యదర్శుల సస్పెన్షన్
పల్లె ప్రకృతి వనాలు ప్రశాంతతకు నిలయాలు
దారుణం : టీనేజ్ సోదరిపై 12 ఏండ్ల బాలుడి లైంగిక దాడి
వెదజల్లే సాగుతో అధిక దిగుబడి : మంత్రి పువ్వాడ
రెండు, మూడు రోజుల్లోవాసాల మర్రికి సీఎం కేసీఆర్ రాక