శుక్రవారం 05 జూన్ 2020
Telangana - May 19, 2020 , 21:09:57

మరణించిన కార్యకర్త కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ భరోసా

మరణించిన కార్యకర్త కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ భరోసా

సిరిసిల్ల: గుండెపోటుతో మరణించిన టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్త కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. సిరిసిల్ల నియోజకవర్గం బండ లింగంపల్లి గ్రామంలోని కార్యకర్త ఇంటికి స్వయంగా వెళ్లి మృతుడి భార్య, పిల్లలతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కార్యకర్త కుటుంబంతోపాటు నేలపై కూర్చుని మంత్రి తన నిరాడంబర వ్యక్తిత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్త కుటుంబాన్ని పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు.


logo