మంగళవారం 26 జనవరి 2021
Telangana - Nov 30, 2020 , 21:11:38

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల

 ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ యాజమాన్య కోటా నోటిఫికేషన్‌ విడుదల

వరంగల్‌ చౌరస్తా: కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ పరిధిలోని వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో యాజమాన్య కోటా అడ్మిషన్ల భర్తీ కోసం సోమవారం యూనివర్సిటీ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. నీట్‌ 2020లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. డిసెంబర్‌ 1వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

నిర్దేశిత దరఖాస్తు వివరాలను పూర్తి చేయడంతో పాటు అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్లు స్కాన్‌ చేసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. దరఖాస్తుదారులు అప్‌లోడ్‌ చేసిన సర్టిఫికెట్లను యూనివర్సిటీ అధికారులు పరిశీలించి అనంతరం తుది జాబితా విడుదల చేస్తారని తెలిపారు. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in ను పరిశీలించవచ్చునని యూనివర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి.


logo