మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Sep 19, 2020 , 00:55:54

అమరుల ఆత్మ.. జ్వలించే దీపం

అమరుల ఆత్మ.. జ్వలించే దీపం

 • నిరంతరం వెలిగే జ్యోతిలా త్యాగధనులు
 • సాగర తీరాన 3.29 ఎకరాల్లో నిర్మాణం
 • వేగంగా రూపుదిద్దుకొంటున్న స్మారకచిహ్నం
 • నా జీవితం చరితార్థం: రూపశిల్పి ఎంవీ రమణారెడ్డి

అరవై ఏండ్ల పోరాటానికి ఆనవాలు.. అమరుల త్యాగానికి చిహ్నం.. నీళ్లు, నిధులు, నియామకాల కోసం సాగిన పోరుకు గుర్తు.. ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం అనే నిప్పు కణానికి నిశాని.. నాలుగు కోట్ల మంది ఆకాంక్షకు ప్రతిరూపం.. భవిష్యత్తు తరాలకు నిరంతర జ్ఞాపకం.. జ్వలించే ‘దీపం’. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వీరుల ఆత్మలను ఒక్కచోట చేర్చినట్టు, పిడికిలి బిగించి ఉద్యమాన్ని నడిపించిన సారథి కృషి, సంకల్పాన్ని చూసినట్టు, ఉద్యమకారుల ఆవేశం, తపన కనిపించినట్టు అమరుల స్మృతి చిహ్నం రూపుదిద్దుకొంటున్నది.

ఖైరతాబాద్‌: అరవై ఏండ్ల పోరా టం.. తెలంగాణ ఉద్యమం. తొలిదశ, మలిదశల్లో సాగిన ఉద్యమంలో ఎంద రో ప్రాణాలను అర్పించారు. మరెంద రో  ఎన్నో నిర్బంధాలు, కష్టాలు అధిగమించి పోరాటాన్ని కొనసాగించారు. తెలంగాణ ఉద్యమం గురించి చెప్పుకుంటూ పోతే నరనరాన రక్తం ఉడుకుతుంది. ఇంతటి గొప్ప పోరాటాన్ని తరతరాలు గుర్తుచేసుకొనేలా చిహ్నం ఉం డాలని తలచిన తెలంగాణ ప్రభుత్వం హుస్సేన్‌సాగర్‌ తీరాన జ్వలించే దీపా న్ని నిర్మిస్తున్నది. లుంబినీపార్క్‌ వద్ద 3.29 ఎకరాల్లో 27,460 చదరపు అడుగుల్లో నిర్మితమవుతున్న అమరుల స్మారక చిహ్నం.. న భూతో న భవిష్య త్‌ అనేలా రూపుదిద్దుకుంటున్నది. నిరంతరం జ్వ లించే జ్యోతితో దీపం ఆకారంలో ప్రపంచంలోనే తొలి అద్భుత కట్టడంగా నిలిచిపోనున్నది. ఇప్పటికే 60% పనులను పూర్తి చేసుకున్న ఈ కట్టడం.. 2021 జూన్‌ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఆవిష్కృతం కానున్నది.

ఆరు అంతస్థుల ఎత్తు

ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో చి హ్నం నిర్మాణాన్ని 2018 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. ఆరు అంతస్థులతో నిర్మితమవుతున్న కట్టడానికి ఒక్కొక్కటి 18 నుంచి 20 టన్నుల బరువుండే 26 స్టీల్‌ పిల్లర్లను వినియోగించారు. ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ గణపతిరెడ్డి, ఎస్‌ఈ పద్మనాభరావు, ఈఈ నర్సింగ్‌రావు, డీఈ మాధవి, ఏఈ ధీరజ్‌ల పర్యవేక్షణలో పదిమంది సైట్‌ ఇంజినీర్లు, 150 మంది వర్కర్లు, వందలమంది కార్మికులు ఈ నిర్మాణంలో నిమగ్నమయ్యారు. తనికెళ్ల ఇంటిగ్రేటెడ్‌, కేపీసీ ప్రాజెక్ట్‌ స్మారకనిర్మాణం చేస్తున్నది. ఈ కట్టడానికి పూర్తిగా సీమ్‌లెస్‌ స్టీల్‌ను వినియోగిస్తున్నారు. ఏండ్లపాటు తుప్పు పట్టకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఎగిసే జ్వాల ఎత్తు.. 45 మీటర్లు

తెలంగాణ అమరుల స్మారక స్థూ పం నిర్మాణం మొత్తం గ్రౌండ్‌ లెవల్‌ నుంచి 50 మీటర్ల ఎత్తులో 27,460 మీటర్ల వైశాల్యంలో చేపడుతున్నారు. అందులో దీపం ఆకారం ఎత్తు 22 మీటర్లు దీర్ఘవృత్తాకారంలో (మేజర్‌ యాక్సిస్‌ 44 మీటర్లు, మైనర్‌ యాక్సిస్‌ 28 మీటర్లు) నిర్మిస్తున్నారు. దీపం నుంచి వచ్చే వెలుగు (జ్వాల ఆకారం) 45 మీటర్ల ఎత్తు ఉంటుంది. దానికీ సీమ్‌లెస్‌ స్టీల్‌వాడుతున్నారు. 

ఈ నిర్మాణంతో నా జీవితం చరితార్థం

చిత్ర కళ నా జీవితంలో ఒక భాగం. చిత్రకళ ప్రదర్శన, అధ్యయనం కోసం 80 దేశాలు తిరిగాను. 14 ఏండ్లు యూరప్‌లో గడిపాను. మలిదశ తెలంగాణ ఉద్యమానికి నా కళ భాగస్వామ్యమయ్యింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలనుకున్నాను. ప్రపంచస్థాయిలో ఏ దేశంలోనూ లేనటువంటి అద్భుత నిర్మాణాన్ని చేపట్టాలన్న సీఎం కేసీఆర్‌ కోర్కె మేరకు అమరుల త్యాగానికి ప్రతీకగా ఈ అద్భుత దీప నిర్మాణానికి రూకల్పన చేశాను. వచ్చే ఏడాది జూన్‌ 2న నా కల నెరవేరబోతున్నది. - ఎంవీ రమణారెడ్డి, రూపశిల్పి

అద్భుత కట్టడంలో అనేక ప్రత్యేకలు

 • బేస్‌మెంట్‌1, 2లో 400 కార్లు, 600 బైక్‌ల పార్కింగ్‌కు ఏర్పాట్లు.
 • గ్రౌండ్‌ఫ్లోర్‌లో స్మారకం మెయింటెనెన్స్‌ గదులు. 
 • మొదటి అంతస్థులో తెలంగాణ అమరుల త్యాగాలు, నాటి ఉద్యమ రథసారథి, నేటి సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో మలిదశ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని సాక్షాత్కరింపజేసేలా ఆడియో, విజువల్‌ కేంద్రం, మ్యూజియం, ఫొటోగ్యాలరీ.
 • రెండో అంతస్థులో భారీ కన్వెన్షల్‌ హాల్‌
 • మూడో అంతస్థు/టెర్రస్‌ ఫ్లోర్‌లో రెస్టారెంట్‌/ల్యాండ్‌స్కేప్‌
 • నాలుగు, ఐదు, ఆరు అంతస్థులు మొత్తం దీపాకృతి
 • స్వాగత ద్వారం వద్ద తెలంగాణ తల్లి విగ్రహం, నీటి కొలనులు, ఫౌంటెన్లు. 

 బ్రహ్మాండంగా అమరుల స్మారకం: మంత్రి వేముల

ఖైరతాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో అమరులైనవారి త్యా గానికి చిహ్నంగా హైదరాబాద్‌ నడిబొడ్డున బ్రహ్మాండంగా స్మారకాన్ని నిర్మిస్తున్నట్టు రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. ఉద్యమసారథి, సీఎం కేసీఆర్‌ రాజీలేని పోరాటం, అమరుల త్యాగఫలితమే నేటి తెలంగాణ అని.. ఈ చిహ్నం కేసీఆర్‌ సంకల్పానికి ప్రతిరూపమని వ్యాఖ్యానించా రు. లుంబినీ పార్కు ఆవరణలో నిర్మితమవుతున్న స్మృతిచి హ్నం పనులను ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, పలువురు ఇంజినీరిం గ్‌ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే నంబర్‌ వన్‌ రాష్ట్రంగా తెలంగాణ విరాజిల్లుతున్నదని, మోస్ట్‌ హ్యాపినింగ్‌ సిటీస్‌లో హైదరాబాద్‌ తొలిస్థానాన్ని దక్కించుకున్నదని అన్నారు. logo