శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 16, 2020 , 01:29:58

సౌదీ నుంచి స్వగ్రామానికి..

సౌదీ నుంచి స్వగ్రామానికి..

  • మాజీ ఎంపీ కవిత చొరవతో చేపూర్‌కు రవి
  • బాధిత కుటుంబం కృతజ్ఞతలు

ఆర్మూర్‌: సౌదీ అరేబియాలో యజమాని చేతిలో చిత్రహింసలకు గురైన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం చేపూర్‌వాసి రవి.. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో సోమవారం స్వగ్రామానికి చేరుకున్నాడు.  చేపూర్‌కు చెందిన అంకమొల్ల రవి ఆరేండ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ వెళ్లాడు. అక్కడ యజమాని చిత్రహింసలు పెడుతుండటంతో రవిని స్వగ్రామానికి రప్పించాలని అతని కుటుంబ సభ్యులు ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం నాయకులు కోటపాటి నర్సింహనాయుడిని కోరారు. 

ఆయన మాజీ ఎంపీ కవిత దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె తక్షణమే స్పందించి,  అక్కడి జాగృతి నాయకుల సాయంతో ఈనెల 2న రవిని యజమాని చెర నుంచి విడిపించి అక్కడే సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆది వారం రాత్రి రవి హైదరాబాద్‌ చేరుకున్నాడు. యజమాని దాడిలో తీవ్రంగా గాయపడిన రవికి జాగృతి నాయకులు నవీన్‌ ఆచారి, ఇఫ్తేకార్‌ సోమవారం నిజామాబాద్‌ లో వైద్యపరీక్షలు చేయించి ఇంటికి తీసు కెళ్లారు. నరక కూపం నుంచి రవిని కాపాడి సొంతూరికి తీసుకొచ్చేందుకు సాయం చేసిన మాజీ ఎంపీ కవితకు రవి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


logo