శుక్రవారం 10 జూలై 2020
Telangana - Jun 03, 2020 , 01:29:23

నాన్నొస్తాడనుకుంటే..డెత్‌ సర్టిఫికెట్‌ వచ్చింది

నాన్నొస్తాడనుకుంటే..డెత్‌ సర్టిఫికెట్‌ వచ్చింది

  • డెత్‌ సర్టిఫికెట్‌ వచ్చింది
  • బతుకుదెరువుకు దుబాయ్‌కి వలస
  • అనారోగ్యంతో మృతి..అక్కడే ఖననం  
  • చివరి చూపునకు నోచుకోని తల్లి, భార్యాపిల్లలు

మానకొండూర్‌ రూరల్‌: బతుకుదెరువుకు దుబా య్‌ వెళ్లిన ఓ వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందగా, అధికారులు అక్కడే ఖననం చేసి డెత్‌ సర్టిఫికెట్‌ పంపించారు. హఠాత్తుగా వచ్చిన పేపర్లు చూసిన అతని భార్యాపిల్లలు, జన్మనిచ్చిన తల్లి కుప్పకూలగా.. తమ కోసం బొమ్మలు తెస్తాడునకున్న అతని పిల్లలకు బెదురుచూపులే మిగిలాయి. కరీంనగర్‌ జిల్లా మానకొండూర్‌ మండలం జగ్గయ్యపల్లికి  చెందిన ఉయ్యాల పర్శరాములు(36) నాలుగేళ్ల కిందట దుబాయ్‌ యునైటెడ్‌ ఎమిరేట్స్‌కు వెళ్లాడు. అక్కడే ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇటీవల అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో అక్కడే ఓ దవాఖానలో చేరాడు. ఈ క్రమంలో మే 13న మృతి చెంద గా.. అక్కడే ఖననం చేసి, డెత్‌ సర్టిఫికెట్‌ను స్వగ్రామానికి పంపింది.  

పెద్దదిక్కును కోల్పోయి..

పర్శరాములుకు 2008లో అనితతో వివాహం కాగా, ఇద్దరు కొడుకులు శ్రీయేష్‌(9), శ్రీమాన్‌(6) జన్మించారు. కుటుంబపోషణ భారం కావడంతో పర్శరాములు మొదట మలేషియాకు, ఆ వెంటనే వ చ్చి నాలుగేండ్ల కిందట దుబాయ్‌ వెళ్లాడు. భర్త చని పోయినట్టు వచ్చిన డెత్‌ సర్టిఫికెట్‌ చూసి అనిత విల పించిన తీరు చూసేవారిని కంటతడిపెట్టించింది.


logo