గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 13, 2020 , 17:32:03

రాకాసి బల్లిని చంపి నెట్టింట పెట్టాడు.. క‌ట‌క‌టాల పాల‌య్యాడు!

రాకాసి బల్లిని చంపి నెట్టింట పెట్టాడు.. క‌ట‌క‌టాల పాల‌య్యాడు!

వ‌న్య‌ప్రాణుల‌ను చంపి సోష‌ల్ మీడియాలో పెట్ట‌డం ఫ్యాష‌న్‌గా మారిపోయింది. అది తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేయ‌డం. ఇదంతా కామ‌న్‌గా అయిపోయింది. అయిన‌ప్ప‌టికీ ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ఇటీవ‌ల అలాంటి సంఘ‌ట‌నే చోటుచేసుకున్న‌ది. తెలంగాణ‌లోని మెద‌క్ జిల్లాకు చెందిన ఒ కుర్రాడు, రాకాసి బల్లి.. అదేనండి మానిట‌ర్ లిజ‌ర్డ్‌ను కోడిని కాల్చిన‌ట్లు కాల్చుకొని తిన్నాడు.

ఇందులో అత‌నితో పాటు మ‌రో ఇద్ద‌రి హ‌స్తాలు కూడా ఉన్నాయి. వారు ఈ సంఘ‌ట‌న‌ని వీడియో తీసి సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్త వైర‌ల్ అయి పోలీసుల కంట ప‌డింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బ‌ల్లిని వ‌న్య‌ప్రాణిగా గుర్తించారు. మానిట‌ర్ లిజ‌ర్డ్‌ని అమ్మినా, చంపినా ఏడేండ్లు జైలు శిక్ష త‌ప్ప‌ద‌న్నారు. ఈ కుర్రాడితోపాటు ఉన్న మ‌రో ఇద్ద‌రి కోసం పోలీసులు గాలిస్తున్నారు.logo