బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 16:22:46

పీజీ మెడికోలకు ప్రభుత్వ సేవలు తప్పనిసరి

పీజీ మెడికోలకు ప్రభుత్వ సేవలు తప్పనిసరి

హైదరాబాద్: పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) వైద్య విద్యార్థులందరికీ ఒక ఏడాది పాటు తప్పనిసరి ప్రభుత్వ సేవలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కొవిడ్ -19 మహమ్మారి, ఆరోగ్య సంరక్షణ కార్మికులకు శిక్షణ ఇవ్వవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల సూపరింటెండెంట్ల ముందు రిపోర్ట్ చేయాలన్న సూచనలతో పీజీ విద్యార్థులను రిలీవ్‌ చేయాలని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ కే రమేష్ రెడ్డి వివిధ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచనలు జారీ చేశారు. కొవిడ్-19 విధుల కోసం రిపోర్ట్ చేయాల్సిన 2017-18 బ్యాచ్‌కు చెందిన పీజీ వైద్య విద్యార్థులకు ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలలను కేటాయించారు.


logo