శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 24, 2020 , 14:55:18

తెలంగాణ లాక్ డౌన్ మూడ‌వ రోజు దృశ్యాలు

తెలంగాణ లాక్ డౌన్ మూడ‌వ రోజు దృశ్యాలు

కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు పల్లెలు అప్రమత్తమయ్యాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించి.. కరోనా వైరస్‌ బారి నుంచి తమకు తామే కాపాడుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌ పిలుపుతో పల్లెల నుంచి మొదలుకొంటే పట్టణాల దాకా చైతన్యం వెల్లివిరిసింది. అక్కడక్కడ కొందరు మినహాయిస్తే.. ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటిస్తున్నారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి రావడం లేదు. కొన్ని చోట్ల అయితే తమ గ్రామాల పొలిమేర్ల వద్ద సూచికలు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తమ గ్రామంలోకి ఎవరూ రావొద్దు అని బ్యానర్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లోకి వచ్చే రహదారులకు అడ్డంగా ముళ్ల కంచెలు, రాళ్లు పెట్టి.. కరోనాపై అప్రమత్తంగా ఉంటున్నారు.

తెలంగాణ లాక్ డౌన్ మూడ‌వ రోజు దృశ్యాలు   
logo