శనివారం 06 జూన్ 2020
Telangana - May 21, 2020 , 09:58:27

నేడు, రేపు రాష్ట్రంలో వడగాడ్పులు

నేడు, రేపు రాష్ట్రంలో వడగాడ్పులు

హైదరాబాద్‌: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదడంతోపాటు, వడగాడ్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అంఫాన్‌ తుఫాను ప్రభావంతో వడగాడ్పులు వీస్తాయని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ అధికారిణి రత్న తెలిపారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు, రేపు 44 డిగ్రీల నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. మే 24 తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతయాని వెల్లడించారు. అంఫాన్‌ తుఫాను బంగ్లాదేశ్‌, పశ్చిమబెంగాల్‌ తీరాల మధ్య కేంద్రీకృతమై  ఉన్నదని తెలిపారు. వచ్చే మూడు గంటల్లో అది బలహీనపడే అవకాశం ఉందన్నారు.


logo