మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 08:20:39

ఓపె‌న్‌‌స్కూ‌ల్‌లో ఇక తెలం‌గాణ పాఠాలు

ఓపె‌న్‌‌స్కూ‌ల్‌లో ఇక తెలం‌గాణ పాఠాలు

హైద‌రా‌బాద్: ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ విద్యా‌ర్థు‌లకు ఈ ఏడాది కొత్త పాఠ్య‌పు‌స్త‌కాలు అందు‌బా‌టు‌లోకి రాబో‌తు‌న్నాయి. ప్రవే‌శాల ప్రక్రియ పూర్తి‌కా‌గానే పూర్తిగా తెలం‌గాణ అస్తి‌త్వంతో కూడిన పాఠ్య‌పు‌స్త‌కాలు విద్యా‌ర్థుల చేతి‌కం‌ద‌ను‌న్నాయి. తెలం‌గాణ ఏర్పడ్డ తర్వాత ఓపెన్‌ స్కూల్‌ పాఠ్య‌పు‌స్త‌కాల సిల‌బ‌స్‌లో మార్పులు చేయా‌లని యోచిం‌చినా, అది కార్య‌రూపం దాల్చ‌లేదు. ఈ నేప‌థ్యంలో విద్యా‌శాఖ అధి‌కా‌రులు తెలం‌గాణ అస్తి‌త్వా‌నికి చోటు కల్పిస్తూ, సిల‌బ‌స్‌‌సహా పాఠ్యాం‌శాల రూప‌క‌ల్పన బాధ్య‌తను రాష్ట్ర విద్యా‌ప‌రి‌శో‌ధన శిక్షణ సంస్థకు (ఎ‌స్‌‌సీ‌ఈ‌ఆర్టీ) అప్ప‌గిం‌చారు.