గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 06, 2020 , 16:26:06

తెలంగాణ లా సెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ లా సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణ లా, పీజీఎల్‌ సెట్‌ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ పాపిరెడ్డి ఫలితాలను విడుదల చేశారు. మూడేళ్ల లాసెట్‌లో 78.60 శాతం ఉత్తీర్ణులు కాగా.. ఐదేళ్ల లాసెట్‌లో 62.35 శాతం, పీజీఎల్‌ సెట్‌లో 91.04 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రకటించారు. మూడేళ్ల లాసెట్‌లో హైదరాబాద్‌కు చెందిన సీహెచ్.స్నేహశ్రీ (98 మార్కులు) మొదటి ర్యాంకు సాధించారన్నారు. ఐదేళ్ల లాసెట్‌లో ఎస్ఎస్‌కే. పాంచజన్య, పీజీఎల్‌సెట్‌లో టి.ప్రవల్లి మొదటి ర్యాంకులు సాధించినట్లు పేర్కొన్నారు. మేలో జరగాల్సిన పరీక్షలు.. మహమ్మారి కారణంగా రెండుసార్లు వాయిదా వేసిన అనంతరం నిర్వహించినట్లు తెలిపారు. కష్టసమయంలో పరీక్షలు నిర్వహించి, ఫలితాల ప్రకటనకు కృషి చేసిన ఉస్మానియా యూనివర్సిటీ, లా సెట్‌ కన్వీనర్‌తో పాటు బృందానికి, టాటా సర్వీసెస్‌ కన్సల్టెన్సీకి ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.