గురువారం 04 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 20:11:05

నకిలీ వార్త ఏదో తెలుసుకోవడానికే ఈ వెబ్‌సైట్‌...

నకిలీ వార్త ఏదో తెలుసుకోవడానికే ఈ వెబ్‌సైట్‌...

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌, కరోనాపై వస్తున్న నకిలీ వార్తల నియంత్రించాలని ఐటీశాఖ నిర్ణయించింది. నకిలీ వార్తల నియంత్రణకు అధికారిక వెబ్‌సైట్‌ను తీసుకువచ్చినట్లు ప్రకటించింది. కరోనా వ్యాప్తిపై రోజురోజుకూ వదంతులు, తప్పుడు సమాచారం పెరుగుతోంది. నకిలీ వార్తలకు చెక్‌ పెట్టేందుకు https://factcheck.telangana.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫాక్ట్‌ లీ మీడియా సంస్థ భాగస్వామ్యంతో ఐటీశాఖ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. వార్త నిజమైనదా కాదా అని అధికారిక మూలాల నుంచి వెబ్‌సైట్‌ నిగ్గుతేల్చనుంది. సరైన ఆధారాలతో రాష్ట్ర ఐటీశాఖ బులెటిన్లు విడుదల చేయనుంది. 


logo