గురువారం 24 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 13:39:36

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు : మంత్రి హరీశ్‌రావు

రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు : మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్‌ : ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి నేడు. కాళోజి జయంతిని ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రజలకు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన యాసల్నే మన బతుకున్నది. నీ భాషల్నే నీ బతుకున్నది. నీ యాసల్నే నీ సంస్కృతున్నది. అంటూ తెలంగాణ భాషను, యాసలోని కమ్మదనాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన మహాకవి కాళోజి అని కొనియాడారు. 

టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ.. తెలంగాణ యాసకు కాళోజి చేసిన సేవలకుగాను మన సీఎం కేసీఆర్‌ ఆయన జయంతియైన సెప్టెంబర్‌ 9న తెలంగాణ భాషా దినోత్సవం పేరుతో ఉత్సవాలు జరుపుతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులందరు అభిమానించే మన తెలంగాణ ముద్దుబిడ్డ పద్మ విభూషణ్‌ కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు.


logo