బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 10:39:23

గాంధీ జూడాల సమ్మె విరమణ

గాంధీ జూడాల సమ్మె విరమణ

హైదరాబాద్‌ : గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న జూనియర్‌ డాక్టర్లు శుక్రవారం ఉదయం సమ్మె విరమించారు. తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ పీ లోహిత్‌ రెడ్డి ప్రకటించారు. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి జూడాలు విధులు బహిష్కరించిన విషయం విదితమే. జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లపై వారితో వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ రెండుసార్లు చర్చలు జరిపారు. మంత్రి ఈటల హామీతో భవిష్యత్‌ కార్యాచరణపై జూడాలు అంతర్గతంగా చర్చించుకున్నారు. ఆ తర్వాత సమ్మె విరమిస్తున్నట్లు జూనియర్‌ డాక్టర్లు ప్రకటించారు. 


logo