ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 16, 2020 , 19:28:52

తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల సీడీ, పుస్తకాల ఆవిష్కరణ

తెలంగాణ జాగృతి బతుకమ్మ పాటల సీడీ, పుస్తకాల ఆవిష్కరణ

హైద‌రాబాద్ : తెలంగాణ జాగృతి రాష్ట్ర బాధ్యులు ఈ సంవత్సరం రికార్డు చేసిన ఎనిమిది సాంప్రదాయ బతుకమ్మ చప్పట్ల పాటల సీడీని శుక్ర‌వారం ఆవిష్కరించారు. జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత సూచన మేరకు రూపకల్పన చేసిన ఈ సీడీలోని పాటలను కవి, రచయిత కోదారి శ్రీను సేకరించగా ప్రముఖ గాయనిలు తేలు విజయ, పద్మావతి, వరం తదితరులు పాడారు. హైదరాబాదులోని అశోక్‌న‌గ‌ర్‌లో గ‌ల తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయంలో సీడీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం జరిగింది. సీడీలోని బతుకమ్మ పాటలతో ముద్రించిన బతుకమ్మ పాటల పాకెట్ సైజ్ పుస్తకాలను ఆవిష్కరించారు.  

అదేవిధంగా మూడు ప్రత్యేక బతుకమ్మ గీతాలను కూడా విడుదల చేసారు. దామోదర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన ఈ మూడు గీతాలకు రచన, సేకరణ కోదారి శ్రీను, సంగీతం వేణు, గానం తేలు విజయ, పద్మావతి, స్ఫూర్తి, వరం. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు మేడె రాజీవ్ సాగర్, వరలక్ష్మి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, కార్యదర్శి రజిత, హైదరాబాదు అధ్యక్షులు అనంతుల ప్రశాంత్, రంగారెడ్డి అధ్యక్షులు అర్చన సేనాపతి, మేడ్చల్ అధ్యక్షులు ఈగ సంతోష్ పాల్గొన్నారు.


logo