బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్‌ఖేర్ ‘కార్తికేయ-2’ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించబోతున్నారు. ఆదివారం అనుపమ్‌ఖేర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్రబృందం ఈ విషయాన్ని ప్రకటించింది. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. నిఖిల్ కథానాయకుడిగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ-2’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. త్వరలో సెట్స్‌మీదకు రానుంది. ‘థ్రిల్లర్ జోనర్లో చక్కటి ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నాం. ధన్వంతరిగా అనుపమ్‌ఖేర్ పాత్ర ఆసక్తికరంగా సాగుతుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, సంగీతం: కాలభైరవ, నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చందు మొండేటి.