గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 01:48:32

పర్యాటకానికి ప్రాధాన్యం

పర్యాటకానికి ప్రాధాన్యం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రకృతి సంపద, సుందర ప్రదేశాలకు తెలంగాణ పెట్టింది పేరు. దేశ, విదేశాల నుంచి పర్యాటకులను ఆకర్శించేందుకు తెలంగాణ ప్రభు త్వం చర్యలు తీసుకొంటున్నది. ప్రకృతి అందాలను కాపాడటం, అదే సమయంలో ఎకో టూరిజంను అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నది. బోగతా వాటర్‌ఫాల్‌, అనంతగిరి హిల్స్‌, మంజీరా వైల్డ్‌లైఫ్‌ శాంక్చురీ, కుంటాల వాటర్‌ఫాల్స్‌, లక్నవరం లేక్‌, మల్లారం ఫారెస్ట్‌, మల్లెలతీర్థం వాటర్‌ఫాల్‌, పాకాల్‌ లేక్‌, పొచ్చెర వాటర్‌ఫాల్స్‌, టైగర్‌ ఫారెస్ట్‌ వంటివి ఎకో టూరిజం స్పాట్‌లుగా అభివృద్ధి చెందిన వాటిలో ఉన్నాయని సామాజిక ఆర్థిక సర్వే నివేదిక వెల్లడిం చింది.
logo
>>>>>>