శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 13:49:40

దేశాభివృద్ధికి మూలస్తంభం తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

దేశాభివృద్ధికి మూలస్తంభం తెలంగాణ : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ : దేశాభివృద్ధికి మూలస్తంభం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఇచ్చిదేమీ లేదని, ఇక్కడి నుంచి వెళ్లే పన్నుల్లో సగం మాత్రమే కేంద్రం తిరిగి ఇస్తున్నదని తెలిపారు. 2014 నుంచి పన్నుల రూపంలో కేంద్రం రూ.2,75,926 కోట్లు రాష్ట్రం నుంచి తీసుకుంటే కేవలం 1,40,329 కోట్లు మాత్రమే రాష్ట్రానికి తిరిగి ఇచ్చిందని కేటీఆర్‌ వెల్లడించారు. కీలక రంగాల్లో పెట్టుబడులు, మూలధన వ్యయం ఫలితంగానే రాష్ట్రంలో వృద్ధి సాధ్యమైందని, వ్యవసాయం, పరిశ్రమలు, సేవల విభాగంలో వృద్ధి కొనసాగుతోందని పేర్కొన్నారు.

2014 నుంచి 2020 మధ్య దేశ తలసరి ఆదాయం 54.9 శాతం పెరిగితే... తెలంగాణ తలసరి ఆదాయం 83.9 శాతం పెరిగిందని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పాలనా విధానాలతో రాష్ట్రంలో జీడీపీ భారీగా పెరిగిందని స్పష్టం చేశారు. దేశ జీడీపీ వృద్ధి రేటు కంటే తెలంగాణ జీడీపీ వృద్ధిరేటు చాలా ఎక్కువగా ఉండటం గర్వకారణమని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఈ వివరాలు తెలుసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కేంద్ర, రాష్ట్ర ఆర్థిక గణాంకాలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.