శుక్రవారం 03 జూలై 2020
Telangana - Feb 18, 2020 , 19:26:10

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణపై నకిలీ కామెంట్స్‌

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి తెలంగాణపై నకిలీ కామెంట్స్‌

హైదరాబాద్‌ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. తెలంగాణపై అవమానకరంగా మాట్లాడారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంత నకిలీవంటే.. చిన్నపిల్లాడినడిగినా చెబుతారు తెలంగాణలో రైల్వే వ్యవస్థ ఎప్పటినుంచి ఉందో. ఢిల్లీ పెద్దల మెప్పు పొందటానికి కావాలని మాట్లాడారో లేక తెలియక మాట్లాడారో గానీ ఆయన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఘోరంగా అవమాన పరిచేవిగా ఉన్నాయి. మోదీ వచ్చేదాక తెలంగాణ ప్రజలకు అసలు రైలు అంటేనే తెలియదని అవహేళనగా మాట్లాడారు. మోదీ దయవల్లే తెలంగాణ ప్రజలకు రైలు అంటే ఎంటో తెలిసిందని, అంతకు ముందు ఎర్రబస్సే దిక్కని ఎగతాళిగా మాట్లాడారు. 

 చర్లపల్లిలో శాటిలైట్‌ రైల్వేస్టేషన్‌ నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  పైవిధంగా  కామెంట్స్‌ చేశారు.  కిషన్‌రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణవాసులు మండిపడుతున్నారు.

హైదరాబాద్‌ స్టేట్‌ దేశంలోనే సొంతంగా రైల్వే వ్యవస్థను కలిగిఉన్న విషయం తెలిసిందే. 1870లోనే నిజాం స్టేట్‌ రైల్వే ఏర్పాటైంది. 1907లో నాంపల్లి రైల్వేస్టేషన్‌, 1916లో కాచిగూడ రైల్వే స్టేషన్‌ల నిర్మాణం జరిగింది. అనంతరం నిజాం స్టేట్‌ రైల్వేస్‌ 1966లో సౌత్‌ సెంట్రల్‌ రైల్వేగా రూపాంతరం చెందింది. రాష్ట్రంలోని ప్రధాన రైల్వేలైన్లు, జంక్షన్లు, స్టేషన్లు అన్నీ నిజాం హయాంలో నిర్మించినవే కావడం ఇప్పటికీ విశేషమే. 


logo