ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 12:47:40

అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం : గవర్నర్‌ తమిళిసై

అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శం : గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌ : అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ, సంక్షేమ పథకాలలో సరికొత్త ఆవిష్కరణలతో దేశానికి దిక్సూచిలా మారి మిగతా అన్ని రాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శ ప్రాయమైందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... భారతదేశంలో మునుపెన్నడూ జరగని విధంగా తెలంగాణ ప్రజలు సుదీర్ఘ శాంతియుత పోరాటం జరిపి రాష్ర్టాన్ని సాధించుకున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఈ ఆరు సంవత్సరాల కాలంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందన్నారు. 

ప్రజల సంతోషం, సంతృప్తియే ప్రభుత్వ పనితనానికి కొలమానమన్నారు. ప్రజల బలమైన భాగస్వామ్యంతో బంగారు తెలంగాణ అతి త్వరలోనే ఆవిషృతమౌతుందన్నారు. కోవిడ్‌-19 క్లిష్ట పరిస్థితిని ప్రజలు ధైర్యంగా ఎదుర్కొంటున్నారన్నారు. తెలంగాణను సంపన్న, ఆరోగ్యకరమైన రాష్ట్రంగా నిలపడంలో మనందరం తప్పక విజయం సాధిస్తామని పేర్కొన్నారు. 

గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు..

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పుట్టినరోజు నేడు. 60వ వసంతంలో అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి ఆరోగ్యంతో సంపూర్ణ జీవితం గడపాలని సీఎం ఆకాంక్షించారు. 


logo