శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 08:19:27

దేశంలోనే శాంతిభద్రతల పరిరక్షణలో ముందున్నం: మహమూద్‌ అలీ

దేశంలోనే శాంతిభద్రతల పరిరక్షణలో ముందున్నం: మహమూద్‌ అలీ

హైదరాబాద్‌.. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే శాంతిభద్రతల పరిరక్షణలో ముందుందని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా షీ టీమ్స్‌ ఆధ్వర్యంలో నగరంలోని చార్మినార్‌ వద్ద షీ టీమ్స్‌, హైదరాబాద్‌ నగర పోలీస్‌ ఆధ్వర్యంలో 5కె, 2కె పరుగును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్‌ అలీ, రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జెండా ఊపి హోంమంత్రి పరుగును ప్రారంభించారు. టీ టీమ్స్‌ ఇన్‌ఛార్జి స్వాతి లక్రా, సినీనటి అంజలి, ఎమ్మెల్యే పాషాఖాద్రి, విద్యార్థినులు, యువత, మహిళా కానిస్టేబుళ్లు పరుగులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. మహిళల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మహిళల్లో భరోసా కల్పించేందుకే షీ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. షీ టీమ్స్‌ రాకతో మహిళలు అర్థరాత్రి కూడా ధైర్యంగా తిరుగుతున్నారన్నారు. షీ బృందాలతో మహిళలకు భరోసా కల్పిస్తున్నట్లు తెలిపారు. భరోసా సెంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పోలీస్‌శాఖలో 17 వేల పోస్టుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు హోంమంత్రి వెల్లడించారు.


logo