శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 09:05:15

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం

ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌ : రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేడు ఇంటర్‌ మొదటి సంవత్సరం, రేపు ద్వీతీయ సంవత్సరం పరీక్షలు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహణ. ఇంటర్‌ పరీక్షలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం నుండి 9 లక్షల 65 వేల 893 మంది విద్యార్థులు హాజరౌతున్నారు. నేటి ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షకు 4 లక్షల 80 వేల 516 మంది విద్యార్థులు హాజరౌతున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి జిల్లా ఇంటర్ విద్యాధికారి కార్యాలయంలో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇంటర్ బోర్డు వెబ్ సైట్ లో బిగ్ ఆర్ఎస్ ద్వారా ఆన్ లైన్ లో ఫిర్యాదుల స్వీకరించనున్నారు. హైదరాబాద్ ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నంబర్ 040-24600110. ఈ నెంబర్ కు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఫోన్ చేయొచ్చు. విద్యార్థులు ఒత్తిడికి లోనైతే 73372 25803 నంబర్ కు ఫోన్ చేయాలని సైకలాజిస్టులు సూచించారు.logo