శనివారం 11 జూలై 2020
Telangana - Jun 15, 2020 , 21:00:10

ఇంటర్‌ ఫలితాల విడుదలకు బోర్డు సిద్ధం!

ఇంటర్‌ ఫలితాల విడుదలకు బోర్డు సిద్ధం!

హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ ఫలితాల విడుదలకు ఇంటర్మీడియట్‌ బోర్డు సిద్ధమైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల విడుదలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ వెల్లడించారు. ప్రభుత్వానికి ఫలితాల నివేదికను మంగళవారం  సమర్పించనున్నారు. రెండు, మూడు రోజుల్లో ఇంటర్‌ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. 

ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు.. ఆ నెల 23వ తేదీ వరకు కొనసాగిన విషయం విదితమే.


logo